Tuesday, May 12, 2015

బీఎస్‌ఎన్‌ఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీ BSNL Management Trainee Recruitment



-భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)లో మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య - 200

అర్హతలు
1. టెలికమ్ ఆపరేషన్స్ పోస్టుకు - టెలీకమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్/ఐటీ/ఎలక్ట్రికల్ బీఈ/బీటెక్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు ఎంబీఏ లేదా తత్సమాన కోర్సు లేదా ఎంటెక్ ఉత్తీర్ణత.

2. టెలికమ్ ఫైనాన్స్ పోస్టుకు: సీఏ/ఐసీడబ్ల్యూ/సీఎస్ ఉత్తీర్ణత
-పరీక్ష కేంద్రం : హైదరాబాద్‌లో ఉంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 25 నుంచి జూన్ 14 మధ్య ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.
-ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.1500/-, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌సీలకు రూ.750/- చెల్లించాలి.
-వెబ్‌సైట్: www.bsnl.co.in
-వయస్సు: 2015, ఆగస్టు 1 నాటికి 30 ఏండ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు 10 ఏండ్ల సడలింపు ఉంటుంది.
-ఎంపిక విధానం: రాతపరీక్ష + గ్రూప్ డిస్కషన్ + ఇంటర్వ్యూ ఆధారంగా
-రాతపరీక్ష విధానం: ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
దీనిలో మూడు సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్‌లో మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ - 150 మార్కులు, సెక్షన్ -2లో కాంగ్నిటివ్ ఎబిలిటీ - 150 మార్కులు, సెక్షన్ -3లో టెక్నికల్ నాలెడ్జ్ -150 మార్కులు కేటాయించారు.
-మొత్తం 450 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు.
-కాలవ్యవధి - మూడు గంటలు
-నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 25 శాతం మార్కులను కోత విధిస్తారు.
-రాతపరీక్షలో జనరల్ అభ్యర్థులకు 40 శాతం, ఓబీసీలకు 36 శాతం, ఎస్సీ/ఎస్టీకు 33 శాతం మార్కులు వస్తే క్వాలిఫైగా పరిగణిస్తారు. మిగతా దశలకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
-శిక్షణ : మేనేజ్‌మెంట్ ట్రెయినీలకు రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది.
-కెరీర్: ప్రొబేషనరీ పీరియడ్ విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి మేనేజర్‌గా పోస్టును ఇస్తారు. ఆ తర్వాత అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా తర్వాత మరికొన్ని పదోన్నతులు ఉంటాయి.

పోస్టు ----- ఖాళీల సంఖ్య
1. టెలికమ్ ఆపరేషన్స్ -- 150
2. టెలికమ్ ఫైనాన్స్ -- 50

ఎంపిక విధానం --- కేటాయించిన మార్కుల శాతం
1. రాతపరీక్ష -- 75 శాతం
2. గ్రూప్ డిస్కషన్ -- 12.5 శాతం
3. ఇంటర్వ్యూ -- 12. 5 శాతం

No comments:

Post a Comment