Monday, April 27, 2015

ఇండియాన్ ఆర్మీ


-మొత్తం ఖాళీలు 334. వీటిలో..
1. సైన్స్ స్ట్రీమ్‌లో - 200
2. ఆర్ట్స్ స్ట్రీమ్‌లో - 134
ఇండియన్ ఆర్మీ హవల్దార్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
వివరాలు:
INDIAN-ARMY
-ఆర్మీలో ఎడ్యుకేషన్ కార్ప్స్‌లో హవల్దార్ ఎడ్యుకేషన్ పోస్టులు.
-సైన్స్, ఆర్ట్స్ స్ట్రీమ్‌ల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: సైన్స్ స్ట్రీమ్ అభ్యర్థులకు ఎమ్మెసీ/బీఎస్సీ/ఎంసీఏ/బీసీఏ/బీటెక్/ బీఎస్సీ(ఐటీ) ఉత్తీర్ణత. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, బయాలజీ, ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్‌ల్లో ఏదైనా ఒకటి సబ్జెక్టులుగా కలిగి ఉండాలి.
-ఆర్ట్స్ స్ట్రీమ్‌కు - ఎంఏ/బీఏలో ఇంగ్లీష్ లిటరేచర్, హిందీ లిటరేచర్, ఉర్దూ లిటరేచర్, హిస్టరీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సైకాలజీ, మ్యాథమెటిక్స్ లేదా సోషియాలజీ కలిగి ఉండాలి.
-వయస్సు: 20 -25 ఏండ్ల మధ్య ఉండాలి. వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి. సైట్ లో పూర్తి నోటిఫికేషన్ చూడవచ్చు.
-శారీరక ప్రమాణాలు: సోల్జర్‌క్లర్క్‌కు ఉండాల్సిన కనీస శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక విధానం
-ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ : 6.20 నిమిషాల్లో 1.6 కి.మీ. దూరం పరుగెత్తాలి. కనీసం 6 పుల్‌అప్స్, జిగ్‌జాగ్ బ్యాలెన్స్, 9 అడుగుల డిచ్ తప్పనిసరిగా క్వాలిఫై కావాలి.
-మెడికల్ టెస్ట్: ఆర్మీ నిబంధనల ప్రకారం మెడికల్‌టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఈరౌండ్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి రాతపరీక్ష ఉంటుంది.
-రాతపరీక్ష: జూలై 26న నిర్వహిస్తారు.
-రాతపరీక్షలో ఒక కాంపోజిట్ పేపర్ ఉంటుంది. ఇది రెండు గంటల కాలవ్యవధిలో నిర్వహిస్తారు.
పార్ట్ -1 అందరికీ కామన్‌గా ఉంటుంది. దీనిలో 50 ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగంలో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్‌పై ప్రశ్నలు ఇస్తారు.
-పార్ట్ -2 సైన్స్, ఆర్ట్స్ వారికి విడివిడిగా నిర్వహిస్తారు. దీనిలో కూడా 50 ప్రశ్నలు ఉంటాయి. 50 మార్కులు. 20 మార్కులు తప్పనిసరిగా రావాలి.
-పార్ట్ -1, 2ల్లో విడివిడిగానే కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది.
-రాతపరీక్షలో క్వాలిఫై అయినవారికి టీచింగ్ ఆప్టిట్యూడ్, ఇంటర్వ్యూ ఉంటుంది.
-ట్రెయినింగ్: పై పరీక్షలన్నింటినీ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారి మెరిట్ లిస్ట్ ప్రకారం ఎడ్యుకేషన్‌క్రాప్స్‌లో ఉద్యోగం ఇస్తారు. వీరికి మధ్యప్రదేశ్‌లోని పచామర్హిలోని ఏఈసీ ట్రెయినింగ్ కాలేజీ అండ్ సెంటర్‌లో ఏడాదిపాటు ఆర్మీకి సంబంధించిన అంశాల్లో శిక్షణ ఇస్తారు.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో, చివరితేదీ: మే 15

Source: namasthetelangaana

No comments:

Post a Comment